News March 1, 2025

బాబోయే.. మండుతున్న ఎండలు

image

వికారాబాద్ జిల్లాలో రోజురోజుకు ఎండలు దంచికొడుతున్నాయి. పరిగి మండలంలో నిన్న 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పుడే ఇలా ఉంటే మనుముందు పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎండల నేపథ్యంలో భయటకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.

Similar News

News March 1, 2025

 ఈనెల 4న సంగారెడ్డిలో సృజన టెక్ ఫెస్ట్

image

సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పి. జానకి దేవి శనివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ టెక్ ఫెస్టులో పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.

News March 1, 2025

విరుష్కను ఫాలో అయిన ఆలియా.. ఫొటోలు డిలీట్!

image

తన కుమార్తె రాహా ముఖాన్ని సోషల్ మీడియాలో చూపించకూడదని నటి ఆలియాభట్ నిర్ణయించుకున్నారు. అందుకే ఇన్‌స్టాగ్రామ్ సహా అన్ని హ్యాండిల్స్ నుంచి ఆమె ఫొటోలను డిలీట్ చేశారు. జామ్‌నగర్, పారిస్‌లో తీసుకున్న వాటినీ ఉంచలేదు. రాహా ముఖం కనిపించని ఒకే ఒక్క చిత్రాన్ని మాత్రం అలాగే ఉంచారు. ఆమె తీసుకున్నది సరైన నిర్ణయమేనని నెటిజన్లు అంటున్నారు. విరుష్క జోడీ తమ పిల్లలను ఎప్పట్నుంచో SMకు దూరంగా ఉంచడం తెలిసిందే.

News March 1, 2025

మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

మోడల్ స్కూల్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 6 – 10 తరగుతుల్లో అడ్మిషన్లకు మార్చ్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్‌ 13న దరఖాస్తు చేసిన వారికి పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు.

error: Content is protected !!