News March 1, 2025
భూపాలపల్లి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

వరంగల్, BHPL జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 12, 2026
పండగకు ఏ చీర కొంటున్నారు?

పండుగ సమయంలో మంగళగిరి పట్టు చీర ధరిస్తే హుందాగా ఉంటుంది. ఇవి తక్కువ ధరల్లో ఫ్యాన్సీ రకాల్లో మార్కెట్లో లభిస్తాయి. యువతులకైనా, మధ్యవయస్కులకైనా ఇవి సూపర్‌గా ఉంటాయి. పైథానీ పట్టు చీర మెరుస్తూ మంచి లుక్ ఇస్తుంది. గద్వాల్ చీరలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. పట్టులో కాకుండా ఫ్యాన్సీలో ట్రెండీగా కనిపించాలనుకుంటే ప్రింట్ చీరలు తీసుకోవచ్చు. ఏవి కట్టుకున్నా దాన్ని హుందాగా క్యారీ చేస్తే అందరి దృష్టీ మీ పైనే..
News January 12, 2026
NRPT: డయల్ యువర్ ఎస్పీకి 19 ఫిర్యాదులు

నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమానికి 19 ఫిర్యాదులు అందాయి. బాధితులు ఫోన్ ద్వారా పెట్రోలింగ్ పెంచాలని, పాత దొంగతనాల కేసులను పరిష్కరించాలని మరియు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కానిస్టేబుళ్లను బదిలీ చేయాలని కోరారు. వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
News January 12, 2026
ఇక డాక్టర్ చదువులు అక్కర్లేదట.. ఎందుకో చెప్పిన మస్క్!

ఎంతో కష్టపడి చదివి మనిషి ప్రాణాలను నిలబెట్టే డాక్టర్ కోర్సులు ఇక అవసరం లేదట. వైద్య విద్యలన్నీ ఉపయోగం లేకుండా పోతాయట. ప్రపంచ కుబేరుడు మస్క్ అంచనాలివి. AIలో వస్తున్న మార్పులతో భవిష్యత్తులో రోబోలే క్లిష్టమైన సర్జరీలూ చేస్తాయని చెప్పారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ ఆరోగ్య సంరక్షణ సేవలూ మెరుగవుతాయని తెలిపారు. ఒక దేశాధ్యక్షుడికి అందే వైద్య సౌకర్యాలు సామాన్యుడికీ అందుబాటులోకి వస్తాయన్నారు.


