News March 22, 2024

విశాఖ తీరంలో డ్రగ్స్ ఉప్పెన.. పార్టీల విమర్శల హోరు

image

AP: వైజాగ్ పోర్టులో 25,000 KGల డ్రగ్స్‌ను CBI స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంటైనర్ డెలివరీకాగా, ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వారిద్దరికీ బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ.. అధికార పార్టీతో లింకులున్నాయని విపక్షాలు ఫొటోలు రిలీజ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

Similar News

News October 2, 2024

దసరాకి ‘గేమ్ ఛేంజర్’ టీజర్: తమన్

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టీజర్‌ను దసరా కానుకగా రిలీజ్ చేయనున్నట్లు X ద్వారా తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో రిలీజ్ కానుంది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. SJ సూర్య, అంజలి, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

News October 2, 2024

ఈ ఏడాది వర్షాలతో ఎంతమంది చనిపోయారంటే..

image

ఈ ఏడాది వర్షాకాలంలో దేశవ్యాప్తంగా భారీ వానలు కురిసిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ఈ వర్షాల కారణంగా 1492మంది కన్నుమూశారని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీరిలో 895మంది వరదల్లో, 597మంది పిడుగుపాటు వలన మరణించినట్లు పేర్కొంది. అత్యధికంగా కేరళలో 397మంది అసువులు బాసినట్లు వెల్లడించింది. ఇక ఈ ఏడాది వర్షపాతం గడచిన ఐదేళ్లలో అత్యధికమని IMD వివరించింది.

News October 2, 2024

మాతో ఘర్షణకు దిగొద్దు: ఇరాన్ అధ్యక్షుడు

image

తమ దేశ ప్రయోజనాలు, పౌరుల రక్షణ కోసమే ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తెలిపారు. ఈ దాడిని ఇజ్రాయెల్ దురాక్రమణకు ‘నిర్ణయాత్మక ప్రతిస్పందన’గా అభివర్ణించారు. ఇరాన్ యుద్ధభూమి కాదని, కానీ ఏదైనా ముప్పు ఉంటే దృఢమైన సంకల్పంతో దానికి వ్యతిరేకంగా నిలుస్తుందని అన్నారు. ఈ విషయం నెతన్యాహు తెలుసుకోవాలని, తమతో ఘర్షణకు దిగవద్దని ట్వీట్ చేశారు.