News March 1, 2025
గద్వాల: 13 నెలల చిన్నారి మృతి

మద్దలబండలో అనుమానాస్పదంగా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. ఫిబ్రవరి 27న గ్రామానికి చెందిన పవిత్రి, నరేశ్ దంపతుల 13 నెలల కుమార్తె దర్శినిని ఇంట్లో పడుకోబెట్టి పనులకెళ్లారు. మ.2 గం. వచ్చి చూసేసరికి చిన్నారి కదలిక లేకుండా పడి ఉంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి చిన్నారి మృతిచెందిందని నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News September 15, 2025
NIRDPRలో 150 ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్(NIRDPR)లో 150 ఎన్యూమరేటెర్ పోస్టులున్నాయి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. 45 ఏళ్ల లోపు డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన, పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: <
News September 15, 2025
నెతన్యాహుకు ట్రంప్ బిగ్ వార్నింగ్

ఖతర్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహుకు US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఖతర్ తమ మిత్రదేశమని, జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇటీవల ఖతర్‌లోని దోహాలో దాక్కున్న హమాస్ కీలక నేతలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే.
News September 15, 2025
చిత్తూరు SPగా తుషార్ డూడీ బాధ్యతలు

చిత్తూరు జిల్లా 68వ SPగా తుషార్ డూడీ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని నూతన ఎస్పీ తెలిపారు. గతంలో ఉన్న ఎస్పీ మణికంఠ స్థానంలో బాపట్ల నుంచి ఈయన బదిలీపై వచ్చారు.