News March 1, 2025
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఆదిలాబాద్ వాసులు భయపడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇవాళ, రేపు 36 °C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News January 24, 2026
ADB: ‘ఇకపై డీలర్ పాయింట్ వద్దే వ్యక్తిగత వాహన రిజిస్ట్రేషన్’

కొనుగోలు చేసే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను డీలర్ పాయింట్ వద్దనే నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ ఉప రవాణా కమిషనర్ రవీందర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త విధానం ద్వారా వ్యక్తిగత వాహన యజమానులు గానీ, వాహనాలు గానీ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ షోరూమ్ నుంచే అవసరమైన అన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియలు పూర్తవుతాయని స్పష్టం చేశారు.
News January 24, 2026
చానక-కోరట ప్రాజెక్టు, రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులపై ADB కలెక్టర్ సమీక్ష

చానక-కోరట ప్రాజెక్టు భూసేకరణ, రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జి నిర్మాణాలపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమీక్షించిన కలెక్టర్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, ఆర్డీఓ స్రవంతి, నీటిపారుదల శాఖ ఈఈ విఠల్ రాథోడ్, రోడ్లు భవనాలు శాఖ ఈఈ నర్సయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ సుభాష్ తదితరులు ఉన్నారు.
News January 24, 2026
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌లోని టీటీడీసీ కేంద్రంలో పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ, ఇతర ఏర్పాట్లను కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, డీఆర్డీఓ రవీందర్, మున్సిపల్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


