News March 1, 2025

పెత్తనం చేసే మహిళా సర్పంచ్ భర్తలకు ఫైన్!

image

చాలా గ్రామాల్లో పేరుకే మహిళా సర్పంచ్ ఉంటారు. ఆమె భర్తే పెత్తనం చేస్తుంటారు. ఇలా మహిళా సాధికారతను దెబ్బతీస్తున్న వారికి జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. ఎన్నికైన మహిళా సర్పంచులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి, పాలనలో వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు ఓ వ్యవస్థ తీసుకురావాలని కమిటీ సూచించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖకు నివేదిక సమర్పించింది.

Similar News

News March 1, 2025

మంచు కొండలు విరిగిపడిన ఘటన.. నలుగురు మృతి

image

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో మంచు కొండలు విరిగిపడిన ఘటనలో నలుగురు మరణించారు. నిన్న మంచుచరియల కింద వీరు చిక్కుకోగా రెస్క్యూ సిబ్బంది వెలికితీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఆరుగురి కోసం ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. మొత్తం 57 మంది చిక్కుకోగా 47 మందిని ఆర్మీ రక్షించింది.

News March 1, 2025

పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఎల్లుండే లాస్ట్ డేట్

image

పోస్టల్ శాఖలో బీపీఎం, ఏబీపీఎం పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 3తో ముగియనుంది. మొత్తం 21,413 ఖాళీలకుగాను ఏపీలో 1,215, తెలంగాణలో 519 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 18-40 ఏళ్ల వారు అర్హులు కాగా రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంది. ఈ నెల 6 నుంచి 8 వరకు తప్పుల సవరణకు పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in/

News March 1, 2025

విడాకులు దొరకవనే భయంతో టెకీ ఆత్మహత్య?

image

మానవ్‌శర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ఉంటాయని భార్య నికిత బెదిరించేదని చెప్పింది. ఫిబ్రవరి 23న కూడా లీగల్ ప్రొసీడింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, మానవ్‌ను ఆగ్రా తీసుకొచ్చి మరోసారి బెదిరించిందని తెలిపింది. భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.

error: Content is protected !!