News March 1, 2025
కోదాడ: కలకలం రేపుతున్న మైనర్ మిస్సింగ్

కోదాడలో బాలిక అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వివరాలిలా.. మేళ్లచెర్వు మండలానికి చెందిన బాలికకు కోదాడకు చెందిన పదో తరగతి అబ్బాయి స్నాప్‌చాట్‌లో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో బాలిక అతడిని కలవడానికి ఇంట్లో బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి కోదాడకు వెళ్లింది. ఆరు రోజులైనా తిరిగి రాకపోవడంతో బాలుడిపై అనుమానం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలుడిని విచారిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News March 1, 2025
అనకాపల్లి: 89.46 శాతం పింఛన్లు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.10 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 89.46 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. సబ్బవరం మండలంలో 95.40 శాతం, కె.కోటపాడు మండలంలో 93.82 మునగపాక మండలంలో 93.05, దేవరాపల్లిలో 92.93, ఎలమంచిలి మున్సిపాలిటీలో 92.72 పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే కసింకోట మండలంలో 92.36, చోడవరం మండలంలో 92.3, పరవాడలో 91.94 శాతం పింఛన్లను పంపిణీ చేశారు.
News March 1, 2025
కృష్ణా: ఇంటర్ ఫస్టియర్ తొలిరోజు పరీక్షకు 98.03% హాజరు

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు విద్యాశాఖాధికారి పీబీ సాల్మన్ రాజు తెలిపారు. తొలిరోజు పరీక్షకు 98.03% మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. మొత్తం 24,810 మందికి గాను 24,323 మంది పరీక్షకు హాజరయ్యారని, 487 మంది గైర్హాజరయ్యారన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు జిల్లాలో నమోదు కాలేదన్నారు.
News March 1, 2025
విడాకులు దొరకవనే భయంతో టెకీ ఆత్మహత్య?

మానవ్‌శర్మ మృతికి విడాకుల భయమే కారణమని మృతుడి సోదరి తెలిపింది. భార్యకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిన తర్వాత విడిపోదామనుకున్నాడంది. అయితే అదంత సులువు కాదని, చట్టాలన్నీ మహిళల వైపే ఉంటాయని భార్య నికిత బెదిరించేదని చెప్పింది. ఫిబ్రవరి 23న కూడా లీగల్ ప్రొసీడింగ్‌కు వెళ్లాల్సి ఉండగా, మానవ్‌ను ఆగ్రా తీసుకొచ్చి మరోసారి బెదిరించిందని తెలిపింది. భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించింది.