News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
Similar News
News November 5, 2025
సిక్కుల ఆరాధ్య దైవం మన గుంటూరు వచ్చారని తెలుసా?

గుంటూరు జిల్లాలో సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ సందర్శించిన ప్రదేశంగా ‘గురుద్వారా పెహ్లీ పాట్షాహీ’ గుర్తింపు పొందింది. రెండవ ఉదాసి (1506–1513) కాలంలో గురునానక్ దక్షిణ భారత పర్యటనలో గుంటూరును సందర్శించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. ఆయన ప్రసంగాలతో ప్రభావితమై ఏర్పడిన ఈ గురుద్వారా ఆధ్యాత్మిక చరిత్రలో ముఖ్య స్థావరంగా నిలిచింది. 19వ శతాబ్దంలో తీర్థయాత్రికులు ఈ ప్రాంతాన్ని తిరిగి అభివృద్ధి చేశారు.
News November 5, 2025
ఫ్రీ బస్సు హామీ.. న్యూయార్క్‌లో విజయం

న్యూయార్క్ (అమెరికా) మేయర్‌గా <<18202940>>మమ్‌దానీ గెలవడంలో<<>> ఉచిత సిటీ బస్సు ప్రయాణ హామీ కీలకపాత్ర పోషించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బస్ లేన్స్, వేగం పెంచుతానని ఆయన హామీ ఇచ్చారు. వాటితో పాటు సంపన్నులు, కార్పొరేట్లపై పన్నులు పెంచి ఉద్యోగులపై ట్యాక్సులను తగ్గిస్తామని చెప్పారు. నగరంలో ఇంటి అద్దెలను కంట్రోల్ చేస్తామని హామీ ఇవ్వడం ఓటర్లను ఆకర్షించింది.
News November 5, 2025
‘టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి లేదు’

ఎన్నికల్లో డబ్బులకు టికెట్లు అమ్ముకునే సంస్కృతి టీడీపీకి, టీజీ కుటుంబానికి లేదని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కర్నూలు కార్పొరేటర్ ఎన్నికల్లో డిపాజిట్లు ఇస్తేనే టికెట్లు ఇస్తారన్న పుకార్లపై ఆయన బుధవారం స్పందించారు. వార్డుల్లో ప్రజలకు అండగా ఉన్న వారికే టికెట్లు కేటాయిస్తామని, టికెట్ ఇచ్చేముందు సర్వేలు చేయిస్తామని మంత్రి ప్రకటించారు.


