News March 1, 2025
ములుగు: 25 ఏళ్ల తర్వాత తెరుచుకున్న రోడ్డు!

ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ ముందు నుంచి 25 ఏళ్ల తర్వాత రోడ్డు మార్గానికి మోక్షం కలిగింది. 2001లో నక్సల్స్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అప్పుడు ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఉండటంతో మందుపాతర్లను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు. అప్పటి ఎస్సై, ప్రస్తుత ఏసీపీ కిరణ్ కుమార్ ఎదురుదాడి చేసి విరోచితంగా పోరాడారు. కాగా, ప్రస్తుతం ఆ రోడ్డు మార్గం ప్రారంభం కానుంది.
Similar News
News October 31, 2025
దేహంలో దాగి ఉన్న పంచభూతాల లీల

‘ఓం నమ:శివాయ’ అనే 5 అక్షరాలతో మనం శివుణ్ని కొలుస్తాం. ఈ పంచాక్షరీ మంత్రమే పంచభూతాలు కూడా. ఈ పంచభూతాల ఆధారంగానే మన శరీరం నిర్మితమైంది. దీనికి సూచనగా దేవుడు మన చేతికి, కాలికి సహజంగానే ఐదు వేళ్లను ఏర్పరిచాడు! ఆధ్యాత్మిక రహస్యాల్లో ఇదొకటి. మనిషి ఐదు వేళ్లను కలిగి ఉండటం, ఐదు భూతాలతో తయారవడం… ఇదంతా సృష్టికర్త మనకిచ్చిన దివ్య సంకేతం. మన శరీరమే పరమేశ్వరుని సృష్టిలో నిక్షిప్తమై ఉన్న అద్భుత రహస్యం! <<-se>>#SIVA<<>>
News October 31, 2025
కేజ్రీవాల్ మరో శీష్ మహల్ కట్టుకున్నారు: బీజేపీ

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మరో శీష్ మహల్ ఉందని BJP ఆరోపించింది. ఢిల్లీ మహల్‌ను ఖాళీ చేశాక చండీగఢ్‌లో 7 స్టార్ బంగ్లాను కేజ్రీవాల్ నిర్మించారని ట్వీట్ చేసింది. 2 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని పంజాబ్ ప్రభుత్వం ఆయనకు కేటాయించిందని చెప్పింది. ఓ ఏరియల్ ఫొటోను షేర్ చేసింది. ఢిల్లీలో CM నివాసాన్ని ₹45 కోట్ల ప్రజాధనంతో శీష్ మహల్‌గా మార్చుకున్నారని గతంలో కేజ్రీవాల్‌పై బీజేపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
News October 31, 2025
సంగారెడ్డి: ప్రతి ఒక్కరికి ఉద్యోగ విరమణ సహజం: ఎస్పీ

ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ సహజమని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. ఎస్ఐ వెంకట్ రెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. వెంకట్ రెడ్డి పోలీసు శాఖకు ఎంతో సేవ చేశారని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావ్, ఏవో కళ్యాణి, ఆఫీస్ ఇన్స్ స్పెక్టర్ కిరణ్ కుమార్, నాగేశ్వర్ రావ్, సదా నాగరాజు, ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.


