News March 1, 2025
కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే కామారెడ్డి వాసులు భయపడుతున్నారు. కామారెడ్డిలో ఇవాళ, రేపు 34 నుంచి 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News March 1, 2025
జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలు: కలెక్టర్

KMR జిల్లాలో 38 కేంద్రాలలో 18,469 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ తెలిపారు. మొదటి సంవత్సరంలో 8743 మంది, ద్వితీయ సంవత్సరంలో 9726 మంది పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్ష కేంద్రంలో తాగునీరు, విద్యుత్ సరఫరా, మెడికల్ టీమ్స్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
News March 1, 2025
నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ.!

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. మ.2:30 గంటలకు నంద్యాల జిల్లాలో 87.75% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,88,688 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.
News March 1, 2025
సాలూర పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్ పేషంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు.