News March 1, 2025

కృష్ణా: ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు 

image

ఇంటర్ పరీక్షలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద కోలాహల వాతావరణం నెలకొంది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు నిర్ణీత సమయంలో చేరుకొని పరీక్షకు హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లాలో మొత్తం 66 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. 

Similar News

News December 31, 2025

జనజీవనానికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు: SP విద్యాసాగర్

image

కృష్ణా జిల్లా ప్రజలకు SP విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా ఆహ్లాదకర వాతావరణంలో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలన్నారు. వేడుకల పేరుతో జనజీవనానికి ఇబ్బంది కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.

News December 31, 2025

ఇన్నోవికాస్-2025లో భాగస్వామ్య ఒప్పందం

image

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో వికాస్ ఇంజినీరింగ్ కళాశాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిందని హబ్ CEO జి. కృష్ణన్ వెల్లడించారు. వికాస్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెక్నాలజీ ప్రదర్శన ‘ఇన్నోవికాస్-2025’ రెండో రోజు కొనసాగింది. సస్టైనబుల్ అభివృద్ధి లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు రూపొందించిన కొత్త ఆలోచనలు, నమూనాలను హబ్ ద్వారా సాంకేతికంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

News December 30, 2025

నిబంధనలు పాటించాలి: ఎస్పీ విద్యాసాగర్

image

కృష్ణా జిల్లా ప్రజలకు ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2026ను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో అశాంతి, మద్యం తాగి, ర్యాష్ డ్రైవింగ్, డీజేలు, చట్టవిరుద్ధ కార్యక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీసు తనిఖీలు, పికెట్లు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు.