News March 22, 2024
చింతపల్లి: అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం

చింతపల్లి మండలంలోని లంబసింగి ఘాట్ రోడ్డులో గురువారం అర్ధరాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దారకొండ నుంచి నర్సీపట్నం వైపుకు వెళుతున్న ఓ లారీ లంబసింగి ఘాట్‌లో తులబాడగెడ్డ సమీపంలోకి వచ్చేసరికి బ్రేక్ ఫెయిలై అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడని స్థానికులు తెలిపారు. గాయాల పాలైన క్లీనర్‌ను డౌనూరు పీహెచ్‌సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 22, 2026
విశాఖ: పాత కక్షలతో కత్తితో దాడి..

జగదాంబ జంక్షన్ వద్ద శనివారం రాత్రి రౌడీషీటర్ అప్పులరాజుపై ఆటో డ్రైవర్ కత్తితో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. పాత గొడవల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసిన మహారాణిపేట పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని సీఐ దివాకర్ యాదవ్ తెలిపారు.
News February 22, 2026
విశాఖ కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.
News February 22, 2026
టాటా నగర్ – ఎర్నాకులం స్పెషల్ ట్రైన్‌కు దువ్వాడలో హాల్ట్

టాటా నగర్-ఎర్నాకులం మధ్య పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ కోస్ట్ రైల్వే ‘ట్రైన్ ఆన్ డిమాండ్’ కింద ప్రత్యేక రైళ్లను (08189/08190) ప్రకటించింది. ఈ రైలు విశాఖ సమీపంలోని దువ్వాడ స్టేషన్‌లో ఆగుతుంది. ఫిబ్రవరి 22న టాటా నగర్‌లో బయలుదేరే రైలు మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు, తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 24న ఎర్నాకులంలో బయలుదేరే రైలు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 4.40 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.


