News March 1, 2025
అల్లూరి జిల్లాలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్

కొత్త వాహన చట్టాన్ని మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారని కొయ్యూరు ఎస్‌ఐ పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఇకపై హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000, డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.5వేలు, మద్యం తాగి, సెల్‌ఫోన్ పట్టుకుని వాహనం నడిపితే రూ.10వేలు, నెంబర్ ప్లేట్ సరిగ్గా లేకుంటే రూ.2వేలు జరిమానా విధించనున్నారు.వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి, సహకరించాలని సూచించారు.
Similar News
News January 8, 2026
విజయవాడ నుంచి 547 అదనపు బస్సు సర్వీసులు

విజయవాడ పండిట్ నెహ్రు బస్ స్టాండ్ నుంచి సంక్రాంతి సందర్బంగా 547 ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో ఎక్కువగా గోదావరి జిల్లాలు, రాజమండ్రి, వైజాగ్ వరకు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14 వరకు సర్వీసులను ఏర్పాటు చేశారు.
News January 8, 2026
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: కలెక్టర్

చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులను ఆదేశించారు. గురువారం అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించిన కలెక్టర్, బోర్డు పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా బోధన అందించాలన్నారు.
News January 8, 2026
ADB: కేంద్రం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలి: సోయం

చట్ట బద్దత లేని లంబాడీలు ఎస్టీలు కాదని, కేంద్ర ప్రభుత్వం తొందరగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేయాలని మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జ్యుయల్ ఒరం, సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయకేలను కలిసి నివేదిక అందజేశారు. తగిన ఆధారాలను, పార్లమెంట్ కమిటీల నివేదికలను మంత్రులకు అందజేశామని పేర్కొన్నారు.


