News March 1, 2025
రాజీనామా తర్వాత GV రెడ్డి తొలి ట్వీట్

AP: టీడీపీకి <<15567607>>రాజీనామా తర్వాత<<>> బడ్జెట్‌ను అభినందిస్తూ జీవీ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం రూ.33,000cr రెవెన్యూ లోటుతోనే రూ.3.2లక్షల కోట్ల బడ్జెట్ రూపొందించారన్నారు. ‘రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వం పట్ల ఎప్పటికీ గౌరవం ఉంటుంది. తక్కువ కాలంలోనే పార్టీలో నాకు దక్కిన గౌరవం పట్ల ఆయనకు రుణపడి ఉంటాను. 2029లోనూ మా సార్ CM కావాలి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 1, 2025
ప్రజల వద్దే రూ.6,471 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు

దేశంలోని ప్రజల నుంచి 98.18% ₹2,000 నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు RBI వెల్లడించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఇంకా 1.82%(₹6,471కోట్లు) నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని తెలిపింది. 2023 మే 19న ₹3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ నోట్లను RBI రీజినల్ కార్యాలయాల వద్ద ఎక్స్‌ఛేంజ్/డిపాజిట్ చేసుకోవచ్చు.
News March 1, 2025
ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

మార్చి నెలలో టాలీవుడ్‌లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
News March 1, 2025
కడప రిమ్స్‌కు పోసాని

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.