News March 22, 2024
CAA హెల్ప్‌లైన్ నంబర్ 1032

CAA దరఖాస్తుదారుల సందేశాలు తీర్చడం, సమాచారం అందించడానికి కేంద్ర హోంశాఖ ‘1032’ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. 2014 డిసెంబర్‌కు ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు, క్రైస్తవులు పౌరసత్వానికి అర్హులు.
Similar News
News October 24, 2025
దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.
News October 24, 2025
IGMCRIలో 226 నర్సు పోస్టులు

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. <
News October 24, 2025
బస్సు ప్రమాదం: తెలంగాణ ప్రభుత్వం పరిహారం

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో రాష్ట్రవాసులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించడమే కాకుండా పరిహారం ప్రకటించింది. <<18088909>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున రేవంత్ సర్కార్ పరిహారం ప్రకటించింది. ఇప్పటికే హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసి.. ప్రత్యేకంగా ఇద్దరు అధికారులను నియమించింది. హెల్ప్ లైన్ నంబర్స్: 9912919545, 9440854433.


