News March 1, 2025
జగిత్యాల: కుక్కల దాడిలో మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన కందరి శ్రీయాన్స్ అనే మూడేళ్ల బాలుడిపై కుక్కలు దాడిచేయడంతో తీవ్రగాయాలైనట్లు గ్రామస్థులు తెలిపారు. బాలుడు శుక్రవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా.. కుక్కలు దాడి చేసి మెడపై గాయపరిచాయి. బాలుడిని చికిత్స నిమిత్తం కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Similar News
News March 1, 2025
ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలివే..

మార్చి నెలలో టాలీవుడ్‌లో బిగ్ హీరోల సినిమాల రిలీజ్ లేకపోయినా పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ నెల 7న ఛావా(తెలుగు డబ్), 14న కిరణ్ అబ్బవరం ‘దిల్‌రూబా’, 28న నితిన్ ‘రాబిన్ హుడ్’, 29న ‘మ్యాడ్ స్క్వేర్’ విడుదల కానున్నాయి. వీటితో పాటు అనువాద చిత్రాలు కింగ్ స్టన్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, వీర ధీర శూరన్ 2(విక్రమ్), L2:ఎంపురాన్ ఇదే నెలలో రిలీజ్ కానున్నాయి. మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు?
News March 1, 2025
పల్నాడు: ఇంటర్ పరీక్షలకు 759 మంది గైర్హాజరు

పల్నాడు జిల్లా వ్యాప్తంగా శనివారం 48 పరీక్ష కేంద్రాలలో ప్రథమ సంవత్సరం ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 17,313 మందికి గాను 16,554 మంది విద్యార్థులు హాజరయ్యారు. 759 మంది హాజరు కాలేదు. 95.62 హాజరు శాతంగా జిల్లా అధికారి నీలావతి తెలిపారు. ఒకేషనల్ కు సంబంధించి 1,168 మంది గాను 1,037 మంది హాజరయ్యారని, మొత్తంగా ఇంటర్ పరీక్షల హాజరు శాతం 95.18గా నమోదైనట్లు పేర్కొన్నారు.
News March 1, 2025
కడప రిమ్స్‌కు పోసాని

AP: సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన నటుడు పోసాని కృష్ణమురళికి జైలులో అస్వస్థతకు గురవ్వగా రాజంపేటలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతుండగా ఈసీజీ పరీక్షలో వైద్యులు స్వల్ప తేడాలు గుర్తించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్‌కు తరలించారు.