News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.
Similar News
News January 12, 2026
ప్రకాశం SP ‘మీకోసం’కు 58 ఫిర్యాదులు

ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం SP మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా SP హర్షవర్ధన్‌రాజు ఆదేశాలతో ఈ కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుదారులు హాజరై తమ సమస్యలను తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. SP కార్యాలయం ఈ వివరాలను ప్రకటించింది.
News January 12, 2026
SKLM: విద్యుత్ సమస్యలపై ఈ నెల 20 నుంచి ప్రజాభిప్రాయ సేకరణ

రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ టారిఫ్ ప్రతిపాదనలపై AP విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి27వరకు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం SE నాగిరెడ్డి కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విచారణలు హైబ్రిడ్ విధానంలో యూట్యూబ్, ఫేస్ బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందన్నారు. టెక్కలి పలాస డివిజన్ కార్యాలయాల నుంచి పాల్గొనవచ్చన్నారు.
News January 12, 2026
నాణ్యతలో రాజీ పడొద్దు.. విద్యార్థుల కిట్‌పై రేవంత్

TG: ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందించనున్న 22 వస్తువుల కిట్‌కు సంబంధించి నాణ్యత విషయంలో రాజీపడొద్దని CM రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ‘వేసవి సెలవుల తర్వాత బడులు ప్రారంభమయ్యే నాటికి కిట్ అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల విషయంలో ఖర్చుకు వెనకాడొద్దు. యూనిఫామ్, బెల్ట్, టై, షూస్, బ్యాగ్, నోట్ బుక్స్, ఇతర వస్తువులను అందించేందుకు ప్రొక్యూర్మెంట్ ప్లాన్లు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.


