News March 1, 2025

లక్కర్ దొడ్డి: గుండెపోటుతో వ్యక్తి మృతి..!

image

నర్వ మండల కేంద్రంలో గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల వివరాలిలా.. లక్కర్ దొడ్డి గ్రామానికి చెందిన అవుసలి బాలకృష్ణయ్య(80) వడ్రంగి పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున ఛాతిలో నొప్పి రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. మార్గం మధ్యలో మృతిచెందారు.

Similar News

News March 1, 2025

అనకాపల్లి జిల్లాలో 93.61 శాతం పింఛన్ల పంపిణీ

image

అనకాపల్లి జిల్లాలో శనివారం సాయంత్రం వరకు 93.61 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పథకం కింద 2,56,274 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,39,892 మందికి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో సబ్బవరం మండలం మొదటి స్థానంలో ఉండగా పాయకరావుపేట చివరి స్థానంలో ఉంది.

News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

News March 1, 2025

నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

image

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

error: Content is protected !!