News March 1, 2025

ప్రియుడితో దాడి చేయించిన భార్య.. మృత్యువుతో పోరాడి భర్త మృతి

image

TG: వరంగల్‌లో 8 రోజులుగా మృత్యువుతో పోరాడి వైద్యుడు సుమంత్ రెడ్డి నేడు చనిపోయారు. FEB 20న ఇతనిపై భార్య మరియా ప్రియుడితో దాడి చేయించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిమ్‌లో శామ్యూల్‌తో మరియాకు పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో సుమంత్ కాపురాన్ని WGLకు మార్చారు. భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె ప్లాన్ వేయగా వీరికి కానిస్టేబుల్ రాజ్ హెల్ప్ చేశాడు. ప్రస్తుతం ముగ్గురూ అరెస్ట్ అయ్యారు.

Similar News

News March 1, 2025

CT: దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రూట్(37) ఫర్వలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. SA బౌలర్లలో జాన్సెన్, మల్డర్ తలో 3, కేశవ్ 2, ఎంగిడి, రబాడ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 180. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు దాదాపు ఖరారైంది.

News March 1, 2025

చెస్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

image

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టాప్-10లో నిలిచారు. మూడో స్థానంలో గుకేశ్(2787), ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి (2777), ఎనిమిదో ర్యాంకులో ప్రజ్ఞానంద(2758) ఉన్నారు. గుకేశ్‌కు తన కెరీర్‌లో ఇదే హైయెస్ట్ ర్యాంకింగ్. కాగా తొలి రెండు స్థానాల్లో కార్ల్‌సన్(2833), నకమురా(2802) కొనసాగుతున్నారు.

News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

error: Content is protected !!