News March 1, 2025
శ్రీశైలంలో నకిలీ నోట్ల కలకలం

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నకిలీ నోట్లు చలామణి కావడం కలకలం రేపింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తుల లక్షలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో శ్రీశైలంలో వ్యాపారాలు ముమ్మరంగా సాగాయి. దీన్ని అదనుగా భావించిన కొందరు నకిలీ నోట్లతో పలు వస్తువులు కొనుగోలు చేశారు. తాజాగా రూ.200 నకిలీ నోట్లను గుర్తించినట్లు ఐస్క్రీం వ్యాపారులు తెలిపారు.
Similar News
News March 1, 2025
HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.
News March 1, 2025
నెన్నెలలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నెన్నెల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి బైక్ పై తన సొంతూరు ఎల్లారం వైపు వెళ్తుండగా బొప్పారం సమీపంలోని నర్సరీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కాగా ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News March 1, 2025
CT: దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు ఖరారు!

ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచులో ఇంగ్లండ్ 179 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రూట్(37) ఫర్వలేదనిపించినా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. SA బౌలర్లలో జాన్సెన్, మల్డర్ తలో 3, కేశవ్ 2, ఎంగిడి, రబాడ చెరో ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా టార్గెట్ 180. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీస్ బెర్తు దాదాపు ఖరారైంది.