News March 1, 2025

జెలెన్‌స్కీ.. బాలక్ బుద్ధి or ధీశాలి?

image

డొనాల్డ్ ట్రంప్‌తో పెట్టుకొనేందుకు మహా మహా దేశాధినేతలే భయపడుతున్నారు. ఎక్కడ టారిఫ్స్ వేస్తే ఎకానమీ ఏమైపోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అలాంటిది శాంతి ఒప్పందంపై సంతకం చేయకుండా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీ వెళ్లిపోవడం అతివిశ్వాసమో ఆత్మవిశ్వాసమో తెలియడం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఇన్నాళ్లూ అమెరికా డబ్బుతోనే యుద్ధం చేసిన ఆయన ఇప్పుడు ఒంటరిగా పుతిన్‌ను ఎదుర్కోగలరా అని సందేహిస్తున్నారు.

Similar News

News March 1, 2025

వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

image

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.

News March 1, 2025

OTT & టీవీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీ!

image

ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీ ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతోంది. సినీ చరిత్రలో తొలిసారి ఈ మూవీ (జీ5)OTTతో పాటు TVల్లో ఒకేసారి రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నారా? COMMENT

News March 1, 2025

భూమిపై ఎక్కువ మంది మాట్లాడే భాషలివే!

image

ప్రపంచంలోని దాదాపు 58 దేశాల్లో 150 కోట్ల మంది ఇంగ్లిష్ మాట్లాడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. 2023 లెక్కల ప్రకారం.. చైనీయులు మాట్లాడే మండరిన్ భాషను 110 కోట్ల మంది, ఇండియన్స్ ఎక్కువగా మాట్లాడే హిందీని 60.9 కోట్ల మంది వినియోగిస్తున్నారు. తర్వాతి స్థానాల్లో స్పానిష్‌ (55 కోట్లు), ఫ్రెంచ్‌ (30.98 CR), అరాబిక్‌ (27.40 CR), బెంగాలీ (27.2 CR), పోర్చుగీసు (26.36 కోట్లు), రష్యన్ (25.50 కోట్లు) ఉన్నాయి.

error: Content is protected !!