News March 1, 2025
పార్వతీపురం: ఇంటర్ పరీక్షలు.. 586 మంది గైర్హాజరు

కురుపాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 9,335 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి 8,749 మంది హాజరయ్యారన్నారు. 586 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వివరాలు వెల్లడించారు. పరిక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
Similar News
News March 1, 2025
రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేష్

రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. శనివారం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాల్లో మంత్రి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో వలసల అధికంగా కొనసాగుతున్నాయని, వాటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News March 1, 2025
MNCL: పోలీస్ కమిషనరేట్‌కు 3 జాగిలాలు

రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు శనివారం 3 జాగిలాలు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన 24వ బ్యాచ్‌కు చెందిన 3 జాగిలాలు పాసింగ్ ఔట్ పూర్తి చేసుకొని కమిషనరేట్‌కు వచ్చాయి. నేరాల నియంత్రణ, నార్కోటిక్, ఎక్స్‌ప్లోజివ్స్ గుర్తింపులో పోలీస్ జాగీలాల పాత్ర కీలకమని సీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు.
News March 1, 2025
నల్లొండ: చదువుకు వయసుతో సంబంధం లేదు: కలెక్టర్

చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని మహిళలు చదువుకుంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. నేడు జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి శిక్షణ పొందుతున్న మహిళలతో ఆమె మాట్లాడారు. 50 సంవత్సరాల తర్వాత చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్నవారూ ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.