News March 1, 2025

వికారాబాద్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు

image

వికారాబాద్ జిల్లాలో నూతనంగా 22,404 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయి. మార్చి నుంచే రేషన్ బియ్యం అందించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి మోహన్ బాబు తెలిపారు. గతంలో 2,41,169 రేషన్ కార్డులు ఉన్నాయి. నూతనంగా మరో 22,404 మంజూరు అయ్యాయి. దీంతో జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,63,573కు చేరింది. SHARE IT

Similar News

News March 1, 2025

KNR: MLC ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి శనివారం సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన బాక్స్‌లను, సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈనెల 3 నుంచి జరగబోయే కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్లు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 1, 2025

తాడిపత్రిలో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం

image

తాడిపత్రి పట్టణంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం పర్యటించారు. పట్టణ పరిధిలోని కృష్ణాపురం టు సచివాలయాన్ని తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పీ- 4 సర్వే ఎలా జరుగుతుందో పరిశీలించారు. మిస్సింగ్ సిటిజన్, చైల్డ్ వితౌట్ ఆధార్ తదితర సర్వేకు సంబంధించి ప్రజలు అందుబాటులో లేకపోవడంతో సచివాలయ సిబ్బందిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

News March 1, 2025

ASF: మహిళలు, చిన్నపిల్లల రక్షణే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

image

మహిళలు, చిన్నపిల్లల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్న పిల్లల చట్టాలపై షీ టీం, భరోసా టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ 65 హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 14 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి 2 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.

error: Content is protected !!