News March 1, 2025

ఏడుపాయలలో విషాదం.. నదిలో మునిగి ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. వీరిలో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.  

Similar News

News March 1, 2025

ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.50 లక్షలు

image

మహా శివరాత్రి సందర్బంగా జరిగిన ఏడుపాయల మహా జాతర ఆదాయం (16 రోజులు) రూ.61.50 లక్షలు వచ్చింది. శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆదాయం ఒడిబియ్యం 53,950, కేశఖండనంకు 68,150, స్పెషల్ దర్శనానికి రూ.9,00,800, లడ్డూ రూ. 18,74,580, పులిహోర రూ.7,96,480, హుండీ రూ.24,56,277 మొత్తం రూ.61,50,237 వచ్చిందన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.32,051 అదనంగా ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.

News March 1, 2025

 ఈనెల 4న సంగారెడ్డిలో సృజన టెక్ ఫెస్ట్

image

సంగారెడ్డిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 4న జిల్లా స్థాయి సృజన టెక్ ఫెస్ట్ నిర్వహించబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పి. జానకి దేవి శనివారం తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఈ టెక్ ఫెస్టులో పాల్గొంటాయని ప్రిన్సిపల్ తెలిపారు.

News March 1, 2025

మోడల్‌ స్కూల్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

మోడల్ స్కూల్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 6 – 10 తరగుతుల్లో అడ్మిషన్లకు మార్చ్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… https:///telanganams.cgg.gov.in వెబ్‌సైట్‌లో నేరుగా దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్‌ 13న దరఖాస్తు చేసిన వారికి పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు.

error: Content is protected !!