News March 1, 2025
ఏడుపాయలలో విషాదం.. నదిలో మునిగి ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. ఇందులో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు.
Similar News
News November 9, 2025
‘ఎలుకల దాడి’పై మంత్రి సత్యకుమార్ సీరియస్

AP: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులను ఎలుకలు కరవడంపై మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్, నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ప్రైవేటు ఏజెన్సీకి నోటీసులు జారీ చేయాలని DME రఘునందన్‌ను ఆదేశించారు. హాస్టల్ వార్డెన్ వివరణ కోరుతూ మెమో ఇవ్వాలని కాలేజీ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కాగా హాస్టల్లోని పరిస్థితులపై తనిఖీ చేస్తున్నామని డీఎంఈ మంత్రికి తెలియజేశారు.
News November 9, 2025
‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరించిన కురసాల కన్నబాబు

విశాఖ వైసీపీ కార్యాలయంలో జిల్లా వైసీపీ అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో ఆదివారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేతులు మీదుగా “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీల ప్రవేటికరణకు వ్యతిరేకంగా నవంబర్-12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
News November 9, 2025
ASF: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: ఎస్పీ

ఈనెల 10 నుంచి 15 వరకు జరగనున్న స్పెషల్ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ కోరారు. క్రిమినల్ కంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబపరమైన, డ్రంక్ & డ్రైవ్, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో లోక్ అదాలత్ ద్వారా రాజీ చేసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.


