News March 1, 2025

రామగుండం: ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి ప్రకటించిన CGM

image

రామగుండంలోని ఎరువుల కర్మాగారం (RFCL) ఈ ఏడాది ఫిబ్రవరి చివరినాటికి 103912.38 మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేసినట్లు యాజమాన్యం ప్రకటించింది. కర్మాగారంలో ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియాను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు ప్లాంటు CGMఉదయ్ రాజహంస ప్రకటించారు. ప్లాంటు అధికారులకు, ఉద్యోగులను CGM అభినందించారు.

Similar News

News March 1, 2025

కాకినాడ: 5,6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.

News March 1, 2025

NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

image

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.

News March 1, 2025

దివ్యాంగులకు ఇక నుంచి UDID కార్డులు

image

TG: సదరం సర్టిఫికెట్లకు రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. దివ్యాంగులకు ఇక నుంచి యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డు(UDID) ఇవ్వాలని నిర్ణయించింది. సదరం సర్టిఫికెట్ ఉన్న దివ్యాంగులందరికీ UDID నంబర్ జనరేట్ చేయాలని జిల్లా కలెక్టర్లను సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ కార్డులు ఉపయోగపడతాయని స్పష్టం చేశారు. మీ సేవల్లో స్లాట్ బుక్ చేసుకుని, సదరం క్యాంపుకు వెళ్తే UDID ఇస్తారు.

error: Content is protected !!