News March 1, 2025
మరోసారి తండ్రైన మస్క్.. మొత్తం 14 మంది పిల్లలు

అపరకుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యారు. తన ప్రేయసి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్ నాల్గో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ 14వ సంతానానికి సెల్డన్ లైకుర్గస్ అనే పేరు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా, మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఆరుగురు, మాజీ లవర్ గ్రిమ్స్‌తో ముగ్గురు, రచయిత ఆష్లే సెయింట్‌తో ఒక్కరు, శివోన్ జిలిస్‌తో నలుగురు పిల్లలు ఉన్నారు.
Similar News
News March 1, 2025
తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని లేఖ

AP: ఇటీవల తిరుమల కొండపై పలుమార్లు విమానాలు చక్కర్లు కొట్టిన ఘటనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని కోరారు. ఆలయ పవిత్రత, ఆగమ శాస్త్ర నిబంధనల దృష్ట్యా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
News March 1, 2025
CT: సెమీస్ చేరిన జట్లివే

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-A నుంచి ఇండియా, న్యూజిలాండ్ జట్లు, గ్రూప్-B నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరాయి. రేపు ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితంతో సెమీస్‌లో ఏ జట్లు పోటీ పడతాయనేది తేలనుంది.
News March 1, 2025
ఇది దేశంలోనే తొలిసారి: మంత్రి సత్యకుమార్

AP: దేశంలోనే తొలిసారిగా ఆశా వర్కర్లకు గ్రాట్యుటీని కూటమి ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి సత్యకుమార్ తెలిపారు. 30yrs సేవల్లో ఉన్న వారికి గ్రాట్యూటీ కింద ₹1.50 లక్షల వరకూ లబ్ధి చేకూరుతుందన్నారు. గరిష్ఠ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో 42,752 మంది వర్కర్లకు మేలు జరుగుతుందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ₹10వేల వేతనం ఇస్తున్నామని, రెండు కాన్పులకు 180 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తామని పేర్కొన్నారు.