News March 1, 2025
రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న వేళ.. రోడ్లపై గస్తీ పెంచండి: సీపీ

రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న వేళ పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ చేసే సమయాన్ని పెంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. ప్రధానంగా విజుబుల్ పోలిసింగ్‌లో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తక్షణమే స్టేషన్ అధికారులు స్పందించడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.
Similar News
News December 29, 2025
వాహనదారులకు అలర్ట్!

మొబైల్ నంబర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లను కేంద్ర రవాణా శాఖ అలర్ట్ చేసింది. చాలామంది పాత నంబర్లను మార్చకపోవడంతో చలాన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి కీలక సమాచారం పొందలేకపోతున్నారని పేర్కొంది. వాహనదారులు Vahan, సారథి పోర్టల్స్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. <
News December 29, 2025
గద్వాల్: ప్రజావాణికి 82 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ అధికారులకు సూచించారు. గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు. ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అయన అధికారులకు సూచించారు.
News December 29, 2025
NMDC స్టీల్ ప్లాంట్‌లో 100 పోస్టులకు నోటిఫికేషన్

ఛత్తీస్‌గఢ్‌లోని NMDC స్టీల్ లిమిటెడ్ 100 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 12, 13, 14, 15 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఐటీఐ(COPA, వెల్డర్, మెకానిక్, ఎలక్ట్రికల్)ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా అప్రెంటిస్ పోర్టల్‌లో రిజిస్ట్రర్ చేసుకోవాలి. వెబ్సైట్: https://nmdcsteel.nmdc.co.in


