News March 1, 2025

ఎల్కతుర్తి: క్రేన్ తగిలి తండ్రి, కొడుకు స్పాట్ డెడ్

image

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతులనడుమ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్రేన్ తగిలి తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతులు కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వర్ రావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 1, 2025

రంజాన్ మాసం ప్రారంభం అవుతున్న వేళ.. రోడ్లపై గస్తీ పెంచండి: సీపీ

image

రేపటి నుంచి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమవుతున్న వేళ పోలీసులు వారి వారి పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్ చేసే సమయాన్ని పెంచుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. ప్రధానంగా విజుబుల్ పోలిసింగ్‌లో భాగంగా పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ఫిర్యాదుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తక్షణమే స్టేషన్ అధికారులు స్పందించడంతో పాటు ఘటనా స్థలానికి చేరుకోవాలని సూచించారు.

News March 1, 2025

మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత

image

వరంగల్ మామునూర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎయిర్ పోర్ట్ క్రెడిట్ విషయంలో వివాదం తెలత్తినట్లు సమాచారం. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించగా.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు భారీగా మోహరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 1, 2025

వరంగల్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

వరంగల్ జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

error: Content is protected !!