News March 1, 2025
ఎస్.కోట: తల్లి మరణం తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

ఎస్.కోటకి చెందిన వ్యక్తి తల్లి చనిపోయిందనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. CI నారాయణమూర్తి వివరాల ప్రకారం.. మండలంలోని అయితన్నపేటకి చెందిన సంతోశ్ కుమార్(35) తల్లి మూడేళ్ల క్రితం మరణించింది. అప్పటి నుంచి మనస్తాపానికి గురైన సంతోశ్ ఫిబ్రవరి 25న మందులో పురుగుమందు కలుపుకొని తాగాడు. దీంతో అతడిని ఎస్.కోట ఆస్పత్రికి తరలించాడు. అక్కడి నుంచి విజయనగరం తరలించగా చికిత్స పొందతూ శుక్రవారం మృతిచెందాడు.
Similar News
News March 1, 2025
VZM: త్వరలో ఉమెన్ హెల్ప్ డెస్క్‌లు: SP

పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో జిల్లాకు చెందిన SHOలతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రస్తుతం స్టేషన్లలో ఉన్న రిసెప్షన్ సెంటర్లను ఉమెన్ హెల్ప్ డెస్క్‌గా మార్చనున్నామని తెలిపారు. డెస్క్‌లో ఒక మహిళా ఏఎస్ఐ బాధ్యులుగా నియమిస్తామని తెలిపారు.
News March 1, 2025
VZM: ఇంటర్ పరీక్షలకు 20,964మంది హాజరు

విజయనగరం జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 20,964మంది విద్యార్థులు రాసినట్లు ఆర్ఐఓ ఆదినారాయణ చెప్పారు. జిల్లాలో 166 పరీక్షా కేంద్రాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులు 18,686మందికి 18,178మంది ఓకేషనల్ విద్యార్థులు 2980 మందికి 2786మంది హాజరయ్యారన్నారు. పరీక్షలలో ఎటువంటి చూసి రాతలు జరగకుండా ఫ్లైయింగ్ స్క్వాడ్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు ఆదినారాయణ చెప్పారు.
News March 1, 2025
VZM: 16 మంది మందుబాబులకు షాక్..!

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై భారీగా జరిమానాలు పడుతున్నాయి. SP వకుల్ జిందల్ ఆదేశాలతో విజయనగరం పట్టణ ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి 16 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టగా ఒక్కొక్కరికి పదివేలు చొప్పున 16 మందికి రూ.1.60 లక్షల జరిమానాను విధించారని SP శనివారం తెలిపారు. ప్రమాదాలు నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నామన్నారు.