News March 1, 2025
జీడి నెల్లూరు: పింఛన్ పంపిణీ చేసిన CM

జీడి నెల్లూరులో CM పర్యటన మొదలైంది. ఇందులో భాగంగా ఆయన పలువురు లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ను పంపిణీ చేశారు. అనంతరం పలువురు వారి సమస్యలను CM దృష్టికి తీసుకురాగా.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ను CM ఆదేశించారు. ఆయన వెంట ఎంపీ దుగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ఉన్నారు.
Similar News
News March 1, 2025
నేడు GD నెల్లూరు రానున్న CM

CM చంద్రబాబు నేడు(శనివారం) చిత్తూరు జిల్లా GD నెల్లూరులో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11.50కు రామానాయుడు పల్లెకు రానున్న ఆయన మ.1 నుంచి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. అనంతరం 3.30కు తిరిగి ప్రయాణం కానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
News March 1, 2025
ప్రభాకర్ సేవలను కొనియాడిన చిత్తూరు కలెక్టర్

జిల్లా పశుసంవర్ధకశాఖలో ఎన్నో సంవత్సరాల పాటు పనిచేస్తూ మూగజీవాలు, రైతులకు డాక్టర్ ప్రభాకర్ చేసిన సేవలు ఎనలేనివని కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రశంసించారు. జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీ)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రభాకర్ శుక్రవారం పదవీ విరమణ చేశారు. ఈ క్రమంలో మిట్టూరులోని ఎన్పీసీ పెవిలియన్లో జరిగిన ప్రభాకర్ పదవీ విరమణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రభాకర్ సేవలను కొనియాడారు.
News February 28, 2025
చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

✒ రోడ్డు ప్రమాదంలో MLA థామస్ బాబాయ్ మృతి
✒ కుప్పం: అంధ యువతి పెళ్లికి CM చంద్రబాబు రూ.5 లక్షల సాయం
✒ కత్తెరపల్లి ZP ఉన్నత పాఠశాలలో సైన్స్ డే వేడుకలు
✒ SRపురం: బెల్లంపాకంలో పడి వ్యక్తి మృతి
✒ పలమనేరులో ఏడుగురు అరెస్ట్
✒ కుప్పంలోని హోటళ్లలో అధికారుల తనిఖీలు