News March 1, 2025
విశాఖలో ఇంటర్ పరీక్షలు.. 95% హాజరు

ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు శనివారం విశాఖ జిల్లాలో 95% మంది హాజరయ్యారని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి సుధీర్ తెలిపారు. జనరల్ పరీక్షలకు 41,945 మందికి 40,000 మంది హాజరయ్యారు. ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 1,741 మందికి 1,635 మంది హాజరయ్యారు. అన్ని కోర్సులకు సంబంధించి 43,686 మందికి 41,634 మంది విద్యార్థులు హాజరు కాగా 2,052 గైర్హాజరు అయ్యారు. 95 శాతం మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
Similar News
News March 1, 2025
మార్చి 14న సింహాచలంలో డోలోత్సవం

మార్చి 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా సింహాచలంలో డోలోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ సిబ్బంది శనివారం తెలిపారు. ఆరోజు ఉదయం 6 గంటల నుంచి స్వామివారు ఉత్సవ విగ్రహాలను కొండమీద నుంచి మెట్లు మార్గంలో ఊరేగింపుగా కొండ కింద ఉన్న ఉద్యానవనానికి తీసుకురానున్నట్లు తెలిపారు. మండపంలో డోలోత్సవం, వసంతోత్సవం, చూర్ణోత్సవం నిర్వహించి తిరువీధి ఊరేగింపు చేయనున్నట్లు తెలిపారు. ఆరోజున ఉండే కళ్యాణం రద్దు చేసినట్లు తెలిపారు.
News March 1, 2025
విశాఖ : ఒక్క నిమిషం .. వారి కోసం..!

విశాఖ జిల్లా వ్యాప్తంగా 87 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులను ఉదయం 8.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారు పరీక్షా కేంద్రాలకు వెళ్లేటప్పుడు ట్రాఫిక్ జామ్ లేదా ప్రయాణానికి సౌకర్యం లేని వారికి కాస్త మనవంతు సాయం చేద్దాం.
News March 1, 2025
రోడ్డుప్రమాదంలో విశాఖ వాసి మృతి

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖ వాసి మృతి చెందాడు. విశాఖ న్యూ పోర్టు కాలనీకి చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం అరకులోయ వైపు వెళుతుండగా డుంబ్రిగుడ మండలం నారింజవలస వద్ద స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమనాథ్ మృతిచెందాడు. రామ్మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.