News March 1, 2025
PDPL: టాస్క్ ద్వారా వివిధ కోర్సుల ద్వారా శిక్షణ జిల్లా కలెక్టర్

టాస్క్ ద్వారా వివిధ కోర్సుల శిక్షణకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగ విద్యార్థులకు ఇటీవల రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం టాస్క్ ద్వారా వివిధ కోర్సులకు సంబంధించి శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్నామన్నారు. పూర్తి వివరాలకు పెద్దపల్లి ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలోని టాస్క్ ఆఫీసులో సంప్రదించాలన్నారు.
Similar News
News March 1, 2025
కొత్తగూడెం: ‘వారి ప్రాణత్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ’

ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో అమరులైన మాదిగ ఉద్యమ నాయకులను స్మరించుకుంటూ శనివారం కొత్తగూడెం పట్టణ కేంద్రంలో వారికి పూలతో ఘన నివాళులు అర్పించారు. అమరులైన వారి ప్రాణ త్యాగాల ఫలితంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని తెలంగాణ ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు సలిగంటి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుమంత్, పవన్, శ్రీనివాస్, అజయ్, చరణ్, చందు, సాయికుమార్, కిషోర్, అనిల్, భరత్, రాకేశ్ పాల్గొన్నారు.
News March 1, 2025
పాల్వంచ: సదరం కార్డుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..

ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డు కోసం యూడీఐడీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ తెలిపారు. శనివారం సదరం క్యాంపులు, ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డులు, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్ఎంవో రమేశ్‌తో సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
News March 1, 2025
ADB ఇంటర్ బోర్డు అధికారిగా జాధవ్ గణేశ్

ఆదిలాబాద్ ఇంటర్ బోర్డు అధికారిగా (DIEO) GJC ప్రిన్సిపల్ జాధవ్ గణేశ్ కుమార్‌ను నియమిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు DIEOగా ఉన్న రవీందర్ కుమార్ పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో గణేశ్‌ను నియమించారు. ఈ మేరకు ఆయన శనివారం DIEOగా బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు చెప్పి స్వాగతించారు.