News March 1, 2025
‘ఛావా’ తెలుగు ట్రైలర్ ఎప్పుడంటే?

మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ సినిమాను తెలుగులోనూ విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్ను ఈ నెల 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ పేర్కొంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్, రష్మిక నటించారు. హిందీలో కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ సినిమా ఈ నెల 7న తెలుగులో రిలీజ్ కానుంది.
Similar News
News January 20, 2026
‘దివ్యాంగులు సహాయ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

డిగ్రీ, పీజీ చదువుతున్న దివ్యాంగులకు సహాయ పరికరాలు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా తెలిపారు. అంధులు, బధిరులు, శారీరక దివ్యాంగులు ఈ నెల 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలన్నారు.
News January 20, 2026
ఇతిహాసాలు క్విజ్ – 129 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి శూర్పణఖ అసలు పేరు ఏమిటి? ఆ పేరుకు అర్థం ఏంటి?
సమాధానం: రావణుడి సోదరి అయిన శూర్పణఖ అసలు పేరు మీనాక్షి. చేప వంటి కళ్లు గలది అని దీనర్థం. అయితే ఆమె గోళ్లు పెద్దవిగా ఉండేవి. అలాగే పదునుగా కూడా ఉండేవి. అందువల్లే ఆమెను ‘శూర్పణఖ’ అని పిలవడం మొదలుపెట్టారు. శూర్పణఖ అంటే జల్లెడ వంటి గోళ్లు కలది అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 20, 2026
హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారు. నిండుగర్భంతో బ్లాక్ డ్రెస్సులో తాజాగా ఆమె దిగిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కూతురైన సోనమ్ 2018లో ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇప్పటికే వాయు అనే కుమారుడు ఉన్నారు. 2007లో ‘సావరియా’తో తెరంగేట్రం చేసిన ఆమె భాగ్ మిల్కా భాగ్, నీర్జా, పాడ్ మ్యాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి సినిమాల్లో నటించారు.


