News March 1, 2025

‘అఖండ-2’: హిమాలయాలకు బోయపాటి!

image

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ-2’ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం హిమాలయాల్లో అద్భుతమైన ప్రదేశాలను గుర్తించే పనిలో బోయపాటి ఉన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇంతకుముందు చూడనటువంటి ప్రదేశాల్లో కొన్ని అసాధారణ సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్.

Similar News

News March 1, 2025

ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

image

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

News March 1, 2025

పాపం ఇంగ్లండ్: 17 మ్యాచ్‌లలో ఓటమి.. ఒక్కటే గెలుపు

image

ఇంగ్లండ్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు టెస్టు, వన్డే, టీ20ల్లో ఓటముల పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాది బట్లర్ సేన వరుసగా 8 సహా 10 మ్యాచ్‌లు ఓడిపోయింది. కేవలం ఒక్కదాంట్లోనే గెలిచింది. CT గ్రూప్ స్టేజీలో 3 మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది. మహిళల జట్టు కూడా వరుసగా ఏడు గేమ్స్ ఓడింది. ఈ ఏడాది ఇప్పటికీ గెలుపు ఖాతా తెరవలేదు. దీంతో ఆ దేశ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News March 1, 2025

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్

image

ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్(TPL) రానుంది. జూన్‌లో ఈ లీగ్‌ను ప్రారంభిస్తామని HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో క్రికెట్ సదుపాయాలను మరింత అభివృద్ధి చేసేందుకు సహకారం ఇవ్వాలని బీసీసీఐని కోరినట్లు పేర్కొన్నారు. ఈ లీగ్ అందుబాటులోకి వస్తే టీమ్స్‌కు ఏ పేర్లు పెడితే బాగుంటాయో కామెంట్ చేయండి?

error: Content is protected !!