News March 1, 2025
ఏలూరు: రైలు ఢీకొని వృద్ధుడి మృతి

ఏలూరుకు చెందిన షేక్ చాన్ బాష (64) గన్ బజార్ సెంటర్ సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా అటుగా వస్తున్న రైలు ఢీకొని శనివారం మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే ఎస్ఐ పీ.సైమన్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతుడి కుటుంబీకులకు మృతదేహాన్ని అందిస్తామని ఎస్ఐ చెప్పారు.
Similar News
News July 4, 2025
శ్రీ సత్యసాయి: పడిపోయిన వెల్లుల్లి ధరలు

ఈ ఏడాది ఆరంభం నుంచి వెల్లుల్లి ధరలు ఆకాశాన్నంటాయి. రెండు వారాలుగా ధరలు తగ్గుముఖం పట్టాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిలో రూ.400 వరకు పలికిన వెల్లుల్లి ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 పలుకుతోందని వ్యాపారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం వెల్లుల్లి సాగు చేసిన రైతులు డీలపడ్డారు. ధరలు పెరగడం వల్ల ప్రజలు, ఉన్నఫలంగా ధర అట్టడుగు స్థాయికి పడిపోవడంతో రైతులు నష్టపోతున్నారన్నారు.
News May 8, 2025
శ్రేయస్ ఖాతాలో అరుదైన రికార్డు

ఐపీఎల్లో శ్రేయస్ అయ్యర్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నారు. కనీసం 50 మ్యాచుల్లో నాయకత్వం వహించి అత్యధిక విజయశాతం కలిగిఉన్న కెప్టెన్గా నిలిచారు. శ్రేయస్ అయ్యర్ విజయశాతం 59.4% ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో హార్దిక్(58.9%), సచిన్(58.8%), ధోనీ(58.4) ఉన్నారు.
News May 8, 2025
లాలూ విచారణకు రాష్ట్రపతి అనుమతి

‘ల్యాండ్ ఫర్ జాబ్’ కేసులో మాజీ రైల్వేమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఈడీ విచారణకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అనుమతించారు. రైల్వే ఉద్యోగుల కుంభకోణంలో లాలూతో పాటు అతని కుటుంబ సభ్యుల విచారణకు పర్మిషన్ ఇవ్వాలని 2022లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. తాజాగా రాష్ట్రపతి నుంచి అనుమతి లభించింది. కాగా లాలూ రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్-D ఉద్యోగాలకు భూమిని లంచంగా తీసుకున్నారనే ఆరోపణలపై కేసు నమోదైంది.