News March 1, 2025

కిర్లంపూడి: ఆటోను ఢీకొట్టిన కారు.. ఒకరి మృతి

image

కిర్లంపూడి మండలం సోమవరం జంక్షన్ వద్ద NH-16పై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ నూకరాజు(47) మృతి చెందాడు. కిర్లంపూడి పోలీసుల వివరాల ప్రకారం.. సోమవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నూకరాజు ఖాళీ వాటర్ కేన్‌లతో ఆటోపై ఇంటికి వస్తుండగా వైజాగ్ వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కిర్లంపూడి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 13, 2026

10 నిమిషాల్లో ఫుడ్ వస్తుంది.. మరి అంబులెన్స్?

image

TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రధాన రహదారిపై కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో 5నెలల గర్భిణి, ఆమె తల్లి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడారు. విచారకరమైన విషయమేమిటంటే గంట వరకు అంబులెన్స్ రాలేదు. 10ని.ల్లో ఫుడ్ డెలివరీ అయ్యే నగరంలో గంట దాటినా అంబులెన్స్ రాకపోవడం ఆందోళనకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. చివరకు ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. సమయానికి అంబులెన్స్ వస్తే ఎన్నో ప్రాణాలు నిలుస్తాయి.

News January 13, 2026

అన్నమయ్య: మద్యం బాటిల్స్‌పై రూ.10 పెంపు.!

image

అన్నమయ్య జిల్లాలో గతనెల 1,12,282 కేసుల లిక్కర్ (IML), 49,398 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.78.16 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9216 కేసులు లిక్కర్, 3936 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.6.50 కోట్ల ఆదాయం లభించింది. ఈ పరిస్థితుల్లో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.

News January 13, 2026

VMLD: బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

వేములవాడలోని బద్ది పోచమ్మ తల్లి ఆలయానికి మంగళవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం భక్తులతో రద్దీగా మారింది. ఈ మేరకు భక్తులు ప్రీతికరమైన బోనాల నైవేద్యాలను, పసుపు కుంకుమలను అమ్మవారికి సమర్పించుకున్నారు. అందరిని చల్లగా చూడు తల్లి అంటూ బద్ది పోచమ్మ తల్లిని వేడుకున్నారు. మేడారం జాతర సందర్భంగా మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.