News March 1, 2025
ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ పరీక్షకు 958 మంది గైర్హాజరు

శనివారం తొలిరోజు జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తెలుగు/సంస్కృతం/హిందీ/ఉర్దూ పరీక్షకు 40,695 మందికి గాను 39,737 మంది హాజరయ్యారు. 958 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు బుక్ కాలేదు. నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు పలు సిటింగ్ స్క్వాడ్ స్ విధుల్లో పాల్గొన్నాయి.
Similar News
News March 1, 2025
RR: 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

ఇంటర్మీడియట్, టెన్త్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, పరీక్షలు జరిగే ప్రదేశాలలో జిరాక్స్ సెంటర్‌లను మూసివేయాలన్నారు. 185 ఇంటర్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు, ఇంటర్ మొదటి, రెండవ వార్షిక పరీక్షలకు 1,47,211 మంది, పది వార్షిక పరీక్షలకు 51,794 విద్యార్థుల పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.
News March 1, 2025
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్‌పోర్ట్: సీఎం

TG: వరంగల్(D) మామునూరు విమానాశ్రయం కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టు తరహాలో ఉండాలని అధికారులకు CM రేవంత్ సూచించారు. నిత్యం రాకపోకలతో కార్యకలాపాలు జరిగేలా డిజైన్ రూపకల్పన జరగాలన్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతి వచ్చిన నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. సాధ్యమైనంత తొందరగా భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి డిజైనింగ్‌కు పంపించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.