News March 1, 2025
నేరాల నియంత్రణలో జాగిలాల పాత్ర కీలకం: CP

నేరాల నియంత్రణలో నార్కోటిక్, ఎక్స్ క్లూజివ్, గంజాయి వాటిని గుర్తించడంలో పోలీస్ జాగిలాల పాత్ర కీలకమని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ జాగిలాలు ఏడాది శిక్షణ పూర్తి చేసుకొని రామగుండం కమిషనరేట్‌కు వచ్చాయన్నారు. డాగ్స్& డాగ్స్ హ్యాండ్లర్స్ పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Similar News
News March 1, 2025
ఆ స్టార్ హీరోలను కలవాలని ఉంది: మోనాలిసా

సోషల్ మీడియా పాపులారిటీతో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్లు కంగనా రనౌత్, సోనాక్షి సిన్హా నుంచి తాను స్ఫూర్తి పొందుతానని చెప్పారు. బాలీవుడ్ స్టార్లు సల్మాన్ ఖాన్, సన్ని డియోల్‌ను కలవాలని ఉందని తెలిపారు. ఈ జనరేషన్ నటులు వరుణ్ ధవన్, టైగర్ ష్రాఫ్ గురించి తెలియదని చెప్పారు. అవకాశం ఇస్తానని చెప్పిన సనోజ్ మిశ్రా తనను కూతురిలా చూసుకుంటారని పేర్కొన్నారు.
News March 1, 2025
చిత్తూరు: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు DIEO సయ్యద్ మౌలా తెలిపారు. తెలుగు/హిందీ/సంస్కృతం/ఉర్దూ/తమిళం పరీక్షలకు 14,480 మందికి గాను 13794 మంది విద్యార్థులు హాజరు కాగా, 686 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ కోర్సులో మొత్తం 2088 మందికి గాను 1885 మంది హాజరు కాగా 203 మంది విద్యార్థులు గైర్హాజరు అయినారని, ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు
News March 1, 2025
భద్రాద్రి: కనిపించిన నెలవంక.. రేపటి నుంచి రంజాన్

భద్రాద్రి జిల్లాలో రంజాన్ పవిత్ర మాసం ఆదివారం నుంచి ప్రారంభమవనుందని ముస్లిం మత పెద్దలు తెలిపారు. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో నెలవంక శనివారం కనిపించడంతో రేపటి నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టనున్నారు. కాగా, రోజా పాటించే ముస్లింలు నమాజ్‌కు మొదటి ప్రాధాన్యతనిస్తారు. నమాజ్ కోసం అన్ని మసీదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సహర్ నుంచి ఇఫ్తార్ వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు.