News March 1, 2025
ఖమ్మం: ‘విద్యార్థులను వేధిస్తున్న లెక్చరర్’

బాడీ పార్ట్స్ తాకనిస్తేనే ఇంటర్నల్ మార్కులు వేస్తానని ఇంటర్ విద్యార్థులను ఓ కాంట్రాక్ట్ లెక్చరర్ వేధించిన ఘటన ఖమ్మం నగరంలో జరిగింది. విద్యార్థులు తెలిపి వివరాలు.. ఖమ్మం వాసి కొండా హరిశంకర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు.
Similar News
News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News March 1, 2025
ఖమ్మం: సంక్షేమ బోర్డును ఎత్తివేసే కుట్ర: ప్రవీణ్

తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా 4వ మహాసభలు శనివారం ఖమ్మం నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. సంఘం జెండా ఆవిష్కరణ అనంతరం జరిగిన మహాసభలో వారు మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి తెచ్చిన సంక్షేమ బోర్డును ఈ ప్రభుత్వం ఎత్తివేయాలనే కుట్ర పన్నుతుందని ఆరోపించారు.
News March 1, 2025
ఖమ్మం జిల్లాలో పెండింగ్ LRS దరఖాస్తులపై సమీక్ష

మార్చి 31లోపు పెండింగ్ LRS దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు డా.పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఈరోజు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, భూ క్రమబద్ధీకరణలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.