News March 1, 2025

ఏడుపాయల జాతర ఆదాయం రూ.61.50 లక్షలు

image

మహా శివరాత్రి సందర్బంగా జరిగిన ఏడుపాయల మహా జాతర ఆదాయం (16 రోజులు) రూ.61.50 లక్షలు వచ్చింది. శనివారం హుండీ లెక్కింపు చేపట్టారు. ఆదాయం ఒడిబియ్యం 53,950, కేశఖండనంకు 68,150, స్పెషల్ దర్శనానికి రూ.9,00,800, లడ్డూ రూ. 18,74,580, పులిహోర రూ.7,96,480, హుండీ రూ.24,56,277 మొత్తం రూ.61,50,237 వచ్చిందన్నారు. గతేడాది కంటే ఈసారి రూ.32,051 అదనంగా ఆదాయం వచ్చినట్లు ఈఓ చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News July 10, 2025

మెదక్: గుణాత్మక విద్య కోసం చొరవ చూపాలి: కలెక్టర్

image

నాణ్యమైన గుణాత్మక విద్యను అందించడానికి సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు చొరవ తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం మెదక్ డైట్‌లో ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు మెరుగుకు సంబంధిత ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఎఫ్ఎల్ఎన్ మానిటరింగ్ సమావేశం, ఉపాధ్యాయుల పని సర్దుబాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు.

News July 9, 2025

మెదక్: మిగిలిన సీట్లకు లాటరీ తీసిన కలెక్టర్

image

మెదక్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకంలో మిగిలిన సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బెస్ట్ అవైలబుల్ స్కీం నందు మిగిలిన సీట్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. కార్యక్రమంలో అధికారి విజయలక్ష్మి పాల్గొన్నారు.

News July 9, 2025

మెదక్: ‘మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే లక్ష్యం’

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలు జిల్లాలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, మహిళా సంఘ సభ్యులతో కలిసి సంబరాలు ప్రారంభించారు. ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. డీపీఎం యాదయ్య, అడల్ట్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి మురళి, కళాకారులున్నారు.