News March 1, 2025

నంద్యాల నగరంలో భారీ ర్యాలీ

image

ఈ నెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

Similar News

News December 25, 2025

నష్టాల నుంచి సక్సెస్ వైపు అడుగులు

image

తొలి ప్రయత్నంతో నష్టంతో ఉదయ్ కుంగిపోలేదు. కృషి విజ్ఞాన కేంద్రం, యూట్యూబ్ నుంచి డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, అంతర పంటల సాగు, హైబ్రిడ్ వెరైటీలను ఆధునిక పద్ధతుల్లో పెంచడంపై శిక్షణ పొందారు. ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన కింద డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి 90% సబ్సిడీ వచ్చింది. దీంతో డ్రిప్, మల్చింగ్ ఏర్పాటు చేసి 20 ఎకరాల్లో మిరప, టమాటా, క్యాబేజీ, బఠాణీ, ఇతర కూరగాయల పంటల సాగు చేపట్టారు.

News December 25, 2025

NLG: 2025 రిపోర్ట్.. సైబర్ నేరాలు పెరిగాయి

image

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం సాధారణ నేరాలు తగ్గాయని ఆయన వెల్లడించారు. అయితే సైబర్ నేరాలు మాత్రం పెరిగాయి. 2024లో 235 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 255 సైబర్ నేరాలు నమోదయ్యాయి. లైంగిక వేధింపుల కేసులు 216 నుంచి 196కు తగ్గాయి. పోక్సో చట్టం కింద గతేడాది 121, ఈ ఏడాది 117 కేసులు పైలయ్యాయి.

News December 25, 2025

పోలవరానికి గోదావరి పుష్కరాలే టార్గెట్: PPA సీఈవో

image

AP: పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని PPA సీఈవో యోగేశ్ స్పష్టం చేశారు. పునరావాస గ్రామాల్లో పర్యటించి మౌలిక వసతులు, పరిహారంపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రంవాల్, బట్రస్ డ్యామ్, కుడి, ఎడమ కాలువ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.