News March 1, 2025
నెన్నెలలో రోడ్డు ప్రమాదం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో నెన్నెల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సంతోష్ తీవ్రంగా గాయపడినట్లు ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. శుక్రవారం రాత్రి బైక్ పై తన సొంతూరు ఎల్లారం వైపు వెళ్తుండగా బొప్పారం సమీపంలోని నర్సరీ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. కాగా ఆయన భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News November 7, 2025
బిహార్‌లో మరోసారి ఎన్డీయేదే విజయం: మోదీ

బిహార్‌లో నిన్న జరిగిన భారీ పోలింగ్ మరోసారి NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలను ఇస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఔరంగాబాద్‌లో జరిగిన ర్యాలీలో ఆయన ఈ కామెంట్లు చేశారు. జేడీయూ అబద్ధాల ప్యాకేజీని రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని అన్నారు. ‘జంగిల్ రాజ్’ను ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ రానివ్వద్దనే దృఢ సంకల్పంతో ఉన్నారని స్పష్టం చేశారు. నిన్న జరిగిన తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ నమోదైంది.
News November 7, 2025
వరంగల్: సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష..!

సైబర్ నేరాలపై అవగాహనే మీకు రక్ష అని వరంగల్ కమిషనరేట్ పోలీసులు ప్రజలకు సూచించారు. ఇంట్లోని చిన్నారులు, విద్యార్థులకు పెద్దలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ మీ కుటుంబాన్ని సైబర్ నేరాల భారీ నుంచి కాపాడుకోవాలని, అవగాహనతోనే నేరాల కట్టడి సాధ్యమని పోలీసులు పేర్కొన్నారు. ప్రజలు సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు. SHARE IT
News November 7, 2025
అక్టోబర్‌లో రూ.119.35 కోట్లు ఆదాయం

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. స్వామివారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1.23 కోట్ల లడ్డూలు విక్రయం జరిగింది. 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు 8.31 లక్షల మంది స్వామి వారికి సమర్పించారు.


