News March 1, 2025
HYD: ఎల్బీనగర్‌లో ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం..!

HYDలో ట్రాన్స్‌జెండర్లు తాము ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నారు. తమ ప్రతిభను చాటి చెబుతూనే పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఇటీవలే ట్రాఫిక్ ఉద్యోగాలకు సైతం వారిని ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. GHMC & MEPMA సహకారంతో, అర్ధనారి ట్రాన్స్‌జెండర్ల పొదుపు సంఘం HYD ఎల్బీనగర్‌లో ఏర్పాటు జరగగా వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News March 2, 2025
HYD: వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు

అంబర్‌పేట్ గోల్నాక జిందాతిలిస్మాత్ వీధిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. అందులో ముగ్గురు ఉగాండా, ఒకరు కెన్యా చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడు లైబీరియా దేశానికి చెందిన వ్యక్తితో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
News March 1, 2025
HYD: సెలబ్రిటీలను మోసం చేసిన యువకుడిపై మరో కేసు నమోదు

గతంలో జూబ్లీహిల్స్ PS పరిధిలో సెలబ్రిటీలు, సంపన్నులను SustainKart పేరుతో మోసం చేసిన ఘటనలో జైలుకెళ్లి వచ్చిన కాంతి దత్‌పై తాజాగా CCSలో మరో కేసు నమోదైంది. పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు తీసుకొని మోసగించినట్లు సౌజన్య అనే మహిళ ఫిర్యాదు చేసింది. తృతీయ జ్యువెలరీ పేరుతో తిప్పల శ్రీజ అనే మహిళను మోసగించిన ఘటనలో కాంతి దత్ గతంలో అరెస్టయ్యాడు. తాజాగా మరో కేసు నమోదు కావడం గమనార్హం.
News March 1, 2025
హైదరాబాద్‌లో రేపటి నుంచి నైట్‌ఔట్!

నైట్ ఔట్ కల్చర్ మన హైదరాబాదీలకు కొత్తేమీ కాదు. కానీ, రేపటి నుంచి నగరంలో కొత్త రూల్స్ ఉండబోతున్నాయి. రంజాన్ నెల సందర్భంగా వ్యాపారులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 24 గంటలూ దుకాణాలు ఓపెన్ చేసేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రేపటి నుంచి మార్చి 31 వరకు ఈ రూల్స్ అమల్లో ఉంటాయి. ఇక మిడ్‌నైట్ షాపింగ్‌కు మన చార్మినార్‌లోని వ్యాపారులు సిద్ధమవుతున్నారు.