News March 1, 2025

వీల్లేంట్రా బాబు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారు!

image

హోటల్‌కు వచ్చిన వారిలో కొందరు రూమ్స్‌లోని వస్తువులను దొంగిలిస్తుండటంతో దీనికి అడ్డుకట్ట వేసేందుకు సదరు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ముంబైలోని ఓ హోటల్ రూమ్స్‌లో ఉన్న బాత్రూమ్ స్లిప్పర్స్ కూడా దొంగతనానికి గురయ్యాయి. దీంతో ఒకే సైజులోని వేర్వేరు చెప్పులను జోడీగా ఉంచారు. ఓ వ్యక్తి దీనిని ఫొటో తీసి Xలో షేర్ చేయడంతో వైరలవుతోంది. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నారేంట్రా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News March 2, 2025

రూట్‌ను ఫాలోకండి.. బజ్‌బాల్‌ను కాదు: కైఫ్

image

ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లండ్ గ్రూప్ దశలోనే వైదొలగడంపై భారత మాజీ క్రికెటర్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అన్ని ఫార్మాట్లలో బజ్‌బాల్‌ను గుడ్డిగా ఫాలో అవ్వొద్దు. “వన్ నేషన్, వన్ స్టైల్” పనిచేయదు. సక్సెస్‌ఫుల్ టీమ్స్ పరిస్థితులకు తగ్గట్లు అడ్జస్ట్ అవుతాయి. జో రూట్‌ను ఫాలో అవ్వండి.. బజ్‌బాల్‌ను కాదు’ అని ట్వీట్ చేశారు.

News March 2, 2025

TODAY HEADLINES

image

AP: జూన్‌ నాటికి DSC ప్రక్రియ పూర్తి: సీఎం చంద్రబాబు
AP: ఆశా వర్కర్ల రిటైర్మెంట్ వయసు పెంపు
AP: జైలులో పోసానికి అస్వస్థత.. నాటకం ఆడారన్న పోలీసులు
TG: కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్
TG: దేశానికి రోల్ మోడల్‌లా పోలీస్ స్కూల్: CM రేవంత్
TG: రేవంత్ మంచి పనులు చేయలేదు: KTR
☛ ఫిబ్రవరి GST కలెక్షన్స్ రూ.1.84లక్షల కోట్లు
☛ ఛాంపియన్స్ ట్రోఫీ: సెమీస్‌కు సౌతాఫ్రికా

News March 2, 2025

ఈనెల 8న కొత్త పథకాలు ప్రారంభం: మంత్రి సీతక్క

image

TG: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మంది మహిళలతో సభ నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఆ రోజున CM రేవంత్ కొత్త పథకాలను ప్రారంభిస్తారని తెలిపారు. RTCకి అద్దెకు ఇచ్చే మహిళా సంఘాలకు చెందిన 50 బస్సులను ప్రారంభిస్తారని, 14,236 అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు.

error: Content is protected !!