News March 1, 2025

చెన్నూర్: పురుగు మందు తాగి యువకుడి సూసైడ్

image

యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన చెన్నూర్ మండలంలో జరిగింది. సీఐ రవీందర్ కథనం ప్రకారం.. నాగపూర్ గ్రామానికి చెందిన గోపి డబ్బుల విషయంలో కొమ్మెర గ్రామానికి చెందిన మధుకర్‌ను కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన మధుకర్‌ ఇంటికి వచ్చి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News July 7, 2025

ఖమ్మం: ఇందిరమ్మ ఇళ్ల ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పేద, మధ్య తరగతి వర్గాల కలల ఇందిరమ్మ ఇళ్లపై ధరల భారం భారీగా పెరిగింది. ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే మొదలు పెడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడంతో భారంగా మారింది. వీటికి తోడు సిమెంట్, స్టీల్, ఇసుక ధరలతో పాటు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలను బట్టి ఒక్కో ఇంటిపై ప్రభుత్వం ఇచ్చే రూ.5 లక్షలతో పాటు, మరో రూ.3 నుంచి రూ.4 లక్షల వరకు అదనపు భారం పడుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

News July 7, 2025

HYD: త్వరలో POLYCET ఫేజ్-1 రిజల్ట్

image

POLYCET-2025 మొదటి ఫేజ్ రిజల్ట్ జులై 4వ తేదీన రావాల్సి ఉండగా ఇప్పటి వరకు రాలేదు. దీంతో కాలేజీల ఆప్షన్స్ ఎంచుకున్న అభ్యర్థులు కంగారు పడుతున్నారు. దీనిపై HYD ఈస్ట్ మారేడ్‌పల్లి పాలిటెక్నిక్ కాలేజీ బృందం ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపింది. త్వరలో https://tgpolycet.nic.in ఫేజ్-1 రిజల్ట్ డిస్ ప్లే చేయబడతాయని పేర్కొంది. రిపోర్టింగ్ కోసం తేదీలు పొడగించే అవకాశం ఉందని తెలిపింది.

News July 7, 2025

HYD: హైరైజ్ కెమెరాలతో 360 డిగ్రీల పర్యవేక్షణ

image

HYD నగర ప్రధాన మార్గాల్లో 21 ప్రాంతాల్లో ఎత్తయిన భవనాలపై హైరైజ్ కెమెరాలను అధికారులను ఏర్పాటు చేశారు. 360 డిగ్రీల కోణంలో 3.4 కిలోమీటర్ల దూరం వరకు రహదారులపై ఉన్న పరిస్థితులను దీని ద్వారా గుర్తించవచ్చు. అక్కడి పరిస్థితులపై గూగుల్‌కు సైతం సమాచారం అందనుంది. HYD కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు పోలీసు అధికారులు కెమెరాలను పర్యవేక్షిస్తున్నారు.