News March 1, 2025
వారికి రేపటి నుంచి ఒంటి పూట బడులు

TG: నెలవంక కనిపించడంతో రేపటి నుంచి <<15622646>>రంజాన్ మాసం<<>> ప్రారంభం కానుంది. దీంతో ఉర్దూ మీడియం విద్యార్థులకు రేపటి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉ.8 నుంచి మ.1.30 వరకు క్లాసులు కొనసాగుతాయని తెలిపారు. కాగా మిగతా విద్యార్థులకు మార్చి 10 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించే యోచనలో సర్కారు ఉంది. APలో ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు ఆరంభం కానున్నాయి.
Similar News
News March 3, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 3, 2025
శుభ ముహూర్తం (03-03-2025)

☛ తిథి: శుక్ల చవితి, రా.12.30 వరకు ☛ నక్షత్రం: రేవతి, ఉ.10.41 వరకు ☛ శుభ సమయం: ఏమీ లేవు ☛ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు ☛ యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు ☛ దుర్ముహూర్తం: మ.12.24-నుంచి 1.12 వరకు, మ.2.46 నుంచి 3.34 వరకు ☛ వర్జ్యం: తె.5.16 నుంచి ☛ అమృత ఘడియలు: ఉ.7.20 గంటల నుంచి 8.50 వరకు
News March 3, 2025
350 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. క్రెడిట్ ఆఫీసర్250, ఇండస్ట్రీ ఆఫీసర్ 75పోస్టులతో పాటు ఇతర ఖాళీలను ప్రకటించింది. జాబ్‌రోల్‌ను బట్టి ప్రత్యేక అర్హతలున్నాయి. మార్చి3నుంచి 24వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇదేకాక ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో 750 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ వచ్చింది. TGలో 31, APలో 25 ఖాళీలున్నాయి మార్చి 9వరకూ అప్లై చేసుకోవచ్చు.