News March 1, 2025
NZB: యాసంగిలో ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఎరువులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. గతేడాది రబీలో 63 వేల మెట్రిక్ టన్నుల ఎరువులను వినియోగించగా, ఈ సారి 77 వేల మెట్రిక్ టన్నులకు ఎరువుల డిమాండ్ పెరిగిందని వివరించారు.
Similar News
News March 3, 2025
సిరికొండ : సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు తూంపల్లి క్రీడాకారిణి

సీనియర్ నేషనల్స్ హాకీ పోటీలకు సిరికొండ మండలం తూంపల్లి క్రీడాకారిణి మమత ఎన్నికైనట్లు అధ్యాపకులు తెలిపారు. ఇటీవల జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించిన సీనియర్ నేషనల్ హాకీ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. జాతీయస్థాయి హాకీ పోటీలు మార్చి 2 నుంచి 10వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పలువురు అభినందించారు.
News March 2, 2025
NZB: యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 3వ తేదీ నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఎన్నికల పోలింగ్ దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ కార్యక్రమం తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానుంది.
News March 2, 2025
NZB: సోమవారం ప్రజావాణి వాయిదా

నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ఉన్న నేపథ్యంలో అధికారులు వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈనెల 8 వరకు ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 10 నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కావున జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని వారు సూచించారు.