News March 1, 2025

కాకినాడ: 5,6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.

Similar News

News November 4, 2025

పశువుల్లో గొంతువాపు వ్యాధి లక్షణాలు – నివారణ

image

వర్షాకాలంలో ఇది ఎక్కువగా వస్తుంది. దీనినే గురకవ్యాధి అని కూడా అంటారు. కలుషితమైన నీరు, మేత వల్ల రోగనిరోధక శక్తి తగ్గితే ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి బారిన పడ్డ పశువు కంటి నుంచి నీరు, నోటి నుంచి చొంగకారుస్తుంటుంది. శ్వాస తీసుకునేటప్పుడు గురక శబ్దం వస్తుంది. తీవ్రమైన జ్వరం ఉంటుంది. గొంతు కిందకు నీరు చేరి గొంతువాపు వస్తుంది. ఈ లక్షణాలు పశువులో కనిపించిన వెంటనే వెటర్నరీ వైద్యుడిని సంప్రదించాలి.

News November 4, 2025

VJA: ఆన్‌లైన్ పెట్టుబడి మోసం.. ముగ్గురి అరెస్ట్

image

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆన్‌లైన్‌ పెట్టుబడి మోసాల్లో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. గుంటూరుకు చెందిన మడతల రమేష్‌రెడ్డి, విశాఖకు చెందిన గండి శ్రీను, విజయవాడకు చెందిన గుర్రపుకొండ శ్రీధర్‌ బాధితుల బ్యాంకు ఖాతాల ద్వారా కోట్ల రూపాయలు లావాదేవీ చేసినట్లు వెల్లడైంది. వీరు వాట్సాప్‌, టెలిగ్రామ్‌ గ్రూపుల్లో నకిలీ పెట్టుబడి పథకాలు నిర్వహించారు. పోలీసులు ఫోన్లు, డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకొన్నారు.

News November 4, 2025

GNT: బ్యాడ్ న్యూస్.. ఈసారి లేనట్టే..!

image

బాపట్ల సూర్యలంక బీచ్‌ను నవంబర్ 4, 5 తేదీలలో (మంగళవారం, బుధవారం) తాత్కాలికంగా మూసివేసినట్లు RDO తెలిపారు. తుఫాను సముద్రంలో ఏర్పడిన చిన్న చిన్న గుంటల కారణంగా సంబంధిత శాఖల అధికారుల రిపోర్టుల ఆధారంగా భక్తులు, పర్యాటకులను అనుమతించమన్నారు. తదుపరి భద్రతా పరిశీలన చేసి ప్రకటన ఇచ్చేవరకు మూసివేయడమైనదని తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా ప్రజలకు కార్తీక పౌర్ణమికి ఈసారి సముద్ర స్నానం లేనట్టే..!