News March 1, 2025

ఖమ్మం జిల్లాలో పెండింగ్ LRS దరఖాస్తులపై సమీక్ష

image

మార్చి 31లోపు పెండింగ్ LRS దరఖాస్తుల స్క్రూటినీ పూర్తి చేయాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్లు డా.పి.శ్రీజ, పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులకు ఈరోజు ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటి పారుదల శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, భూ క్రమబద్ధీకరణలో అవకతవకలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 2, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల

News March 2, 2025

కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్‌.. కేంద్రమంత్రి క్లారీటీ..!

image

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

News March 2, 2025

కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై కనిపించని పురోగతి

image

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.

error: Content is protected !!